కనీసం నెల రోజులు కూడా కాకముందే మళ్ళీ పెద్ద సమస్య ఏర్పడింది. దింతో జెరోధా (Zerodha), క్విల్‌బాట్ (Quillbot) లాంటి చాలా వెబ్‌సైట్‌లు పనిచేయకుండ ఆగిపోయాయి. ఆశ్చర్యకరంగా చాలా నమ్మకమైన యాప్‌లలో ఒకటైన డౌన్‌డిటెక్టర్ (DownDetector) కూడా ఆగిపోయింది.
భారతదేశంలో చాలా మంది వాడే ఫైనాన్స్ యాప్ అయిన జెరోధా కూడా అదే ఎర్రర్ చూపిస్తోంది. అంతేకాకుండా డిజైనర్లు, ఆర్టిస్టులు ఎక్కువగా ఉపయోగించే కాన్వా (Canva) కూడా పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడ్డారు.
క్లౌడ్‌ఫ్లేర్ (Cloudflare) డౌన్ వల్ల దెబ్బతిన్న యాప్‌లు, వెబ్‌సైట్స్ చూస్తే:
జెరోధా: క్లౌడ్‌ఫ్లేర్ డౌన్ వల్ల జెరోధాకు సైట్ పడిపోయింది. ఇది భారతదేశంలో ఎక్కువగా వాడే ఫైనాన్షియల్ యాప్.
డౌన్‌డిటెక్టర్: ఏదైనా సర్వీస్ ఆగిపోతే దాని గురించి తెలుసుకోవడానికి ఈ వెబ్‌సైట్‌ను ఎక్కువగా నమ్ముతారు. కానీ దురదృష్టవశాత్తూ డౌన్‌డిటెక్టరే ఆగిపోయింది. దింతో ఈ అంతరాయం ఎంతవరకు ఉందో తెలుసుకోవడానికి సమాచారం లేదు.
క్విల్‌బాట్: ఇది ప్రపంచవ్యాప్తంగా రైటర్స్, విద్యార్థులు వాడే ముఖ్యమైన ఎడిటింగ్ & ప్రూఫ్ రీడింగ్ టూల్. ఈ వెబ్‌సైట్ కూడా ఆగిపోయి, 'local_rate_limited' అనే ఎర్రర్‌ను చూపిస్తోంది.
క్లౌడ్‌ఫ్లేర్ అఫీషియల్ పోస్ట్‌లో చెప్పినట్లుగా, కంపెనీ ఇప్పటికే సమస్యను పరిష్కరించి పరిస్థితులను గమనిస్తోంది. ప్రస్తుతం, దీనిపై ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతోంది. ఈ సమస్య క్లౌడ్‌ఫ్లేర్ డాష్‌బోర్డ్ అలాగే దానికి సంబంధించిన APIలకు సంబంధించినది అయి ఉండొచ్చు. డాష్‌బోర్డ్/క్లౌడ్‌ఫ్లేర్ APIలను ఉపయోగించే కస్టమర్లందరూ దీనివల్ల ఇబ్బంది పడతారు. ఎందుకంటే వారి రిక్వెస్ట్‌లు ఫెయిల్ అవ్వడం లేదా ఎర్రర్స్ చూపించడం జరగవచ్చు.
