జగనన్న సురక్ష పథకం. .. ఈ నెల 23 నుంచి మరో స్కీం.. ఏపీ సీఎం జగన్ కొత్త నిర్ణయం

జగనన్న సురక్ష పథకం. .. ఈ నెల 23 నుంచి  మరో స్కీం.. ఏపీ సీఎం జగన్ కొత్త నిర్ణయం

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని కొత్తగా ప్రవేశ పెడుతున్నట్లు సీఎం జగన్ తెలిపారు.  ఈ పథకం అమలుపై కలెక్టర్లు, ఎస్పీలతో తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 23 నుంచి జులై 23 వరకు జగనన్న సురక్ష పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. 

సర్టిఫికెట్ల సమస్యలు...

సర్టిఫికెట్లకు సంబంధించి, అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా? లేవా? అన్నదానిపై ఈ కార్యక్రమంలో జల్లెడపడతారన్నారు.  ఏదైనా పత్రాలకు సంబంధించి, డాక్యుమెంటేషన్‌, సర్టిఫికెట్లు, ప్రభుత్వ పతకాలు, అర్హతలు తదితర వాటికి సంబంధించి మండలాధికారులు క్యాంపులు నిర్వహిస్తారని..సమస్యలు ఉన్నవారిని సచివాలయాల వద్దకు తీసుకువచ్చి.. వారి కావాల్సిన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అన్నీ కూడా అందిస్తారని సీఎం జగన్ తెలిపారు. జగనన్న సురక్షలో వివిధ పథకాల కింద అర్హులుగా గుర్తించినవారికి ఆగస్టు 1న నగదు బదిలీ చేస్తామన్నారు

గ్రీవెన్స్ రిజెక్ట్ అయితే ....

అర్హులను గుర్తించి వారికి ఆగస్టు 1 నుంచి పథకాలు మంజూరు చేయాలని ఆదేశించారు. ప్రజలకు సేవలు అందించడంలో ఉన్నత ప్రమాణాలు పాటించాలని సూచించారు.. గ్రీవెన్స్ రిజెక్ట్ చేస్తే ఎందుకు తిరస్కరించారో ఫిర్యాదుదారుడు ఇంటికెళ్లి వివరించాలని సూచించారు.24 గంటల్లోగా వాటిని పరిష్కరించాలన్నారు. ప్రజలకు అన్నిరకాలసేవలు అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. జగనన్న ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగంగా పెంచాలని, త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ సూచించారు.

కల్తీ విత్తనాల పట్ల అలర్ట్..

వర్షాకాలం ప్రారంభమైనందున విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొరత రాకుండా చూడాలని ఆదేశించారు.  కల్తీ విత్తనాల పట్ల అలర్ట్‌గా ఉండాలన్నారు.ఎక్కడైనా కల్తీ కనిపిస్తే కలెక్టర్లు, ఎస్పీలను బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. జులై 1 నుంచి ఇ-క్రాప్‌ బుకింగ్స్‌ ప్రారంభించి... సెప్టెంబరు మొదటి వారానికి పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. సెప్టెంబరు నెలాఖరులోగా తుది జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని ఆదేశించారు. సీసీఆర్సీ కార్డులపై అవగాహన కల్పించి…కౌలు రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొదటి ఫేజ్‌లో 2వేల గ్రామాల్లో జగనన్న భూహక్కు, భూ రక్షకార్యక్రమం పూర్తయ్యిందని సచివాలయాల స్థాయిలోనే రిజిస్ట్రేషన్‌ సహా అన్నిరకాల సేవలు వీరికి అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు.  ఈ గ్రామాల నుంచి రైతులు ఎవ్వరూకూడా తహశీల్దార్‌, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం రాకూడదని స్పష్టం చేశారు.