మర్రి చెట్టుకు కేసీఆర్‌ పేరు

మర్రి చెట్టుకు కేసీఆర్‌ పేరు

రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌ సమీపంలో ఇటీవల ప్లాంటేషన్‌ చేసిన మర్రి చెట్టుకు సీఎం  కేసీఆర్‌ పేరు పెట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు 70 ఏళ్ల వయస్సున్న భారీ మర్రిచెట్టు నేలకూలింది. అది ఎండిపోతుండటంతో అదే గ్రామానికి చెందిన సారధి కళాకారుడు దొబ్బల ప్రకాష్‌ ఆ చెట్టుకు నీరు పెట్టి చిగురింపజేశాడు. ప్లాంటేషన్‌ కోసం ఎదురు చూస్తుండగా మంత్రి కేటీఆర్‌, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ ప్రోత్సాహంతో వీఏటీఏ బృదం భారీ క్రేన్ల సహాయంతో ఈ నెల 14న సిరిసిల్ల కలెక్టరేట్‌ సమీపంలో మర్రిచెట్టును ప్లాంటేషన్‌ చేశారు. కేసీఆర్‌ జన్మదినం రోజున చెట్టువద్ద సిద్ధిపేట డీపీఆర్వో ధశరథంతో కలిసి ప్రకాష్‌ మర్రి వృక్షానికి కేసీఆర్‌ పేరు నామకరణం చేశారు. ఆ తర్వాత కేసీఆర్‌ జన్మదిన సంబరాలు జరిపారు.