గ్రామ పంచాయతీల అభివృద్ధికి TRS ప్రభుత్వం విశేష కృషి 

గ్రామ పంచాయతీల అభివృద్ధికి TRS ప్రభుత్వం విశేష కృషి 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గ్రామ పంచాయతీలు మురికికూపాలుగా ఉండేవన్నారు సీఎం కేసీఆర్. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతనే గ్రామపంచాయతీల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నామని ప్రకటించారు. అందుకు నిదర్శనంగా కేంద్ర ప్రభుత్వం అనేక అవార్డులతో గుర్తించిందని తెలిపారు. అసెంబ్లీలో  ప‌ల్లె ప్ర‌గ‌తిపై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ సంద‌ర్భంగా స‌భ్యులు మాట్లాడిన తర్వాత కేసీఆర్ మాట్లాడారు.

గత ప్రభుత్వాల హయంలో బడ్జెట్ను ఎలా ఖర్చు పెట్టాలనేదానికి ప్రణాళికలు కూడా లేవనిన్నారు సీఎం కేసీఆర్. తాము అధికారంలోకి వచ్చాకా అంతా ప్రణాళికబద్ధంగా చేస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు భారీగా పెంచినట్లు చెప్పారు. ప్రతి గ్రామానికి రూ.5 లక్షల ఆదాయం సమకూరేలా చేస్తున్నామన్నారు. గతంలో 9 వేల గ్రామాలకు 3 వేల పంచాయతీ కార్యదర్శులు ఉండేవారన్నారు. ప్రతి ఊరికి ఒక పంచాయతీ కార్యదర్శిని ఉండేలా నియామకాలు చేపట్టామన్నారు. గ‌తంలో పారిశుధ్య కార్మికుల‌కు స‌రిగా జీతాలు ఇచ్చేవారు కాదన్నారు. గ్రామ‌పంచాయ‌తీల‌కు చార్జ్ డ్ అకౌంట్ ఏర్పాటు చేశామన్న సీఎం.. వ‌ర్క‌ర్ల‌కు ముందుగా జీతాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.