సామరస్యంగా పరిష్కరించుకుందాం.. నల్లమల సాగర్ కు నీళ్లు తీసుకెళ్తం

సామరస్యంగా పరిష్కరించుకుందాం.. నల్లమల సాగర్ కు  నీళ్లు తీసుకెళ్తం
  • పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తం
  • తెలంగాణలోని ఏడు మండలాల విలీనం వల్లే ...
  • పోలవరానికి మార్గం సుగమం
  • గొడవలతో ఎవరికీ ప్రయోజనం ఉండదు
  • ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి: నదీ జలాల సమస్యను సామరస్యం గా పరిష్కరించుకుందామని ఏపీ సీఎం చంద్ర బాబునాయుడు అన్నారు. అదే సమయంలో నల్లమల సాగర్ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు తీసుకెళ్తామని చెప్పారు. పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని అన్నారు. గొడవ లతో ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. తనకు గొడవలు వద్దని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు.

 తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రైతులకు పట్టాదారు పాస్​ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ.. పట్టిసీమ ద్వారా 100 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించి పంటలను కాపాడటమే కాకుండా, అక్కడ పొదుపు చేసిన నీటిని శ్రీశైలం నుండి హంద్రీనీవా, గాలేరునగరి వంటి ప్రాజెక్టుల ద్వారా రాయలసీమకు అందించి ...రాళ్ల సీమను... రత్నాల సీమగా మారుస్తున్నామని వివరించారు. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తనకున్న నిబద్ధతను చాటుతూ, అప్పట్లో తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్​ లో విలీనం చేస్తేనే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ మండలాల విలీనం వల్లే నేడు పోలవరం పనులు సుగమమ య్యాయని, ప్రస్తుతం ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని చం ద్రబాబు పేర్కొన్నారు.