రూల్స్ పాటించని 75 బస్సులపై కేసులు : రవాణా శాఖ అధికారులు

రూల్స్ పాటించని 75 బస్సులపై కేసులు : రవాణా శాఖ అధికారులు
  •     జరిమానాల కింద రూ.1.30 లక్షల వసూలు

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ బస్సుల తనిఖీలు ముమ్మరం చేశారు. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో అధిక చార్జీలను వసూలు చేస్తుండడంతో పాటు కొందరు ప్రైవేట్ ఆపరేటర్లు ఫిట్​నెస్​ లేని వాహనాలను నడుపుతున్నట్టు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. ఈ నెల 7 నుంచి ప్రారంభమైన ఈ తనిఖీల్లో ఇప్పటి దాకా 75 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ​ అధికారులు తెలిపారు. రూ.1.30 లక్షల జరిమానా విధించినట్టు పేర్కొన్నారు. 

ప్రయాణికులు తీసుకెళ్లే బస్సుల్లో గూడ్స్​ తీసుకువెళ్లడం, ప్రయాణికుల లిస్ట్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేకపోవడం లాంటి రూల్స్​ను బ్రేక్ ​చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 8 తనిఖీ బృందాలు ఏర్పాటు చేశారు. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ప్రైవేట్ బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేయరాదని, స్టేజీ క్యారేజీగా బస్సులు తిప్పొద్దని రవాణా శాఖ హెచ్చరించింది. త్వరలో స్లీపర్ బస్సుల నిర్వహణ పై మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపారు.