తెలంగాణ రైతుల ప్రయోజనాలు, నీళ్ల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 2026, జనవరి 9వ తేదీ ప్యూచర్ సిటీలోని ఫ్రూయిడ్స్ యూనిట్ ప్రారంభోత్సవ సభలో ఈ వ్యాఖ్యలు చేశారాయన.
నీళ్ల విషయంలో ఎవరితోనూ గొడవలు పెట్టుకునే ఉద్దేశం లేదని.. అదే సమయంలో తెలంగాణ నీటి వాటాను వదులుకునేది లేదన్నారు సీఎం రేవంత్. నీటి విషయంలో ఆంధ్రాతో ఇబ్బందులు ఉంటే.. కూర్చుని మాట్లాడుకోవటానికి రెడీ అన్నారాయన.
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను నిలిపివేయించానని.. చంద్రబాబుతో మాట్లాడి పనులకు బ్రేక్ వేశానంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ అంశంపై ఏపీలో మాజీ సీఎం జగన్ మాట్లాడిన తర్వాత.. సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయటం విశేషం.
నీటి వాటా.. నీటి కేటాయింపుల అంశంపై ఏపీతో చర్చలకు సిద్ధం అని.. సమస్యలను కూర్చుని మాట్లాడుకోవటానికి రెడీగా ఉన్నానని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
