తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం చంద్రబాబుకి పంపారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలంటూ సీఎం చంద్రబాబుకు జంగా కృష్ణమూర్తి విజ్ఞప్తి చేశారు.
వైసీపీ హయాలో తనకు కేటాయించిన బాలాజీ నగర్ ఫ్లాట్ నెంబర్:2 ఇప్పటివరకు ఖాళీగా ఉంది దాన్ని రీ అలాట్మెంట్ చేయవలసిందిగా సీఎం చంద్రబాబును జంగా కృష్ణమూర్తి కోరారు. ఆ విషయాన్ని టీటీడీ బోర్డుకు పంపారు. తరువాత తదుపరి బోర్డు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపడమైనది. ఓ దినపత్రికలో ప్రచురించిన వార్తపై స్పందించిన జంగా... నేను నా అధికారాన్ని అడ్డుపెట్టుకొని పవిత్ర స్థలమైన భగవానుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అపవిత్రం చేస్తున్నానని, వ్యక్తిగత హననం చేయటం ఎంతవరకు ధర్మమమని ప్రశ్నించారు.
మంత్రివర్గ సమావేశంలో వాస్తవాలు తెలుసుకోకుండా బోర్డు నిర్ణయాన్ని రద్దు చేస్తామనడం నిర్ణయించడం బాధాకరమన్నారు. కలియుగ భగవానుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇప్పటివరకు సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు జన్మతహా రుణపడి ఉంటానని జంగా అన్నారు.
