మన దేశంలో యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలతో లక్షల మంది చనిపోతున్నారు. పొగ మంచుతో.. నిద్ర మత్తులో.. రోడ్లు బాగోలేక బ్యాలెన్స్ కాకపోవటం.. అతి వేగం.. ముందు, వెనకా వాహనాలను చూసుకోకుండా వెళ్లటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని కంట్రోల్ చేయటానికి.. రోడ్డు యాక్సిడెంట్లు తగ్గించటానికి V2V టెక్నాలజీని తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ. V2V అంటే.. వెహికల్ టూ వెహికల్.. ఇప్పటికే విదేశాల్లో ఈ టెక్నాలజీ అందుబాటులో ఉంది.. అక్కడ వాడుతున్నారు.. 2026 నుంచి ఇండియాలోనూ పూర్తి స్థాయిలో అమలు చేయబోతున్నారు. కొత్తగా రాబోయే అన్ని కార్లు, బస్సులు, లారీల్లో ఈ V2V టెక్నాలజీని కంపల్సరీ చేయబోతున్నట్లు వెల్లడించారు కేంద్ర మంత్రి గడ్కారీ.
V2V టెక్నాలజీ అంటే ఏంటీ..?
V2V అంటే.. వెహికల్ టూ వెహికల్. ఇది కమ్యూనికేషన్ సిస్టం. దీన్ని వాహనంలో అమర్చుతారు. దీనికి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీ కారు రోడ్డుపై వెళుతున్నప్పుడు.. మీ దగ్గరగా మరో వాహనం వచ్చినట్లయితే.. మీ వాహనంతోపాటు.. మీ దగ్గరకు వచ్చిన వెహికల్ డ్రైవర్లను ఇది అలర్ట్ చేస్తుంది. వాహనం స్పీడ్ ను ఆటోమేటిక్ గా కంట్రోల్ చేస్తుంది.
ఎగ్జాంపుల్ తీసుకుంటే.. మీరు హైదరాబాద్ రోడ్డుపై కారులో వెళుతున్నారు. మీకు అతి సమీపంలో మరో కారు వచ్చింది. అప్పుడు ఈ V2V టెక్నాలజీ.. మీకు, మీ దగ్గరగా వచ్చిన కారు డ్రైవర్లను అలర్ట్ చేస్తుంది. యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది.. స్పీడ్ తగ్గించండి అని చెబుతుంది. దీంతో మనం వెంటనే అప్రమత్తం అయ్యి.. దూరంగా వెళ్లటం లేదా మన కారును ఆపటం జరుగుతుంది. మీరు హైవే కారులో వెళుతున్నారు. కొన్ని సార్లు మీ ముందు వాహనం ఉందో లేదో కూడా కనిపించదు.. వర్షం వల్ల.. పొగ మంచు వల్ల.. అలాంటి సమయంలో మీరు ఎదురుగా ఉన్న వెహికల్ దగ్గరకు వెళుతున్నట్లయితే వెంటనే మీ కారు స్పీడ్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది.. మిమ్మల్ని వాయిస్ ద్వారా అలర్ట్ చేస్తుంది. దీని వల్ల యాక్సిడెంట్ నుంచి తప్పించుకోవచ్చు అన్నమాట.. మీ వాహనానికి ముందు, వెనకా.. పక్కన ఇలా అన్ని వాహనాల్లోని వాళ్లను ఈ టెక్నాలజీ ద్వారా అలర్ట్ వెళుతుంది.
ప్రస్తుతం హై ఎండ్ కార్లలో ADAS అడ్వాన్సుడు డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ ఉంది. ఈ V2V టెక్నాలజీని ADASకు అనుసంధానించనున్నారు ఇండియాలో. ఈ టెక్నాలజీ మీ కారులో పెట్టించుకోవాలంటే 5 నుంచి 7 వేల రూపాయల వరకు ఖర్చవుతుంది.
రాబోయే రోజుల్లో అన్ని వాహనాల్లో ఇది కంపల్సరీ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. ఆ దిశగా ఇప్పటికే అన్ని వాహన తయారీ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చింది. పాత వాహనాల్లోనూ దీన్ని కచ్చితంగా అమర్చుకునే విధంగా నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. 2026 చివరి నాటికి పూర్తి స్థాయిలో అమలు చేయటానికి సన్నాహాలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. సో.. ఇక నుంచి యాక్సిడెంట్లు జరగవా అంటే మాత్రం.. చిన్న చిన్న పొరపాట్లు.. కునుకుపాట్ల వల్ల జరిగే పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకోవటం మాత్రం పక్కా అంటున్నారు నిపుణులు.
