చంచల్గూడ జైలును తరలిస్తాం.. విద్యాసంస్థగా మారుస్తాం: సీఎం రేవంత్రెడ్డి

చంచల్గూడ జైలును తరలిస్తాం.. విద్యాసంస్థగా మారుస్తాం: సీఎం రేవంత్రెడ్డి

హైదరాబాద్: పాతబస్తీలో మెట్రో రైల్ లైన్ శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. చంచల్ గూడ జైలును వేరేచోటికి తరలిస్తామన్నారు. చంచల్ గూడ జైలును విద్యాసంస్థగా మారుస్తామని చెప్పారు. రాజకీయాలు వేరు..అభివృద్ది వేరు.. అభివృద్ధికోసం మున్సిపల్ శాఖను నా దగ్గరే ఉంది. మరో ఐదేళ్లు మా ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది.. అభివృద్ధి పైసే దృష్టి పెడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 

ALSO READ :- ప్రెగ్నెన్సీ టైంలో మధుమేహం రిస్క్ ఉందా?

2028 వరకు ఓల్డ్ సిటీ మెట్రో ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు సీఎం. హైదరాబద్ నగరంలో 55 కిలోమీటర్లు మూసీ నదీ పారుతుంది.మూసీ పరివాహక ప్రాంతాన్ని  అద్భుతంగా అభివృద్ది చేస్తామన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడుతాం కానీ వ్యక్తుల మధ్య ఎలాంటి కక్షలు ఉండబోవన్నారు సీఎం రేవంత్ రెడ్డి.