హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చేనెల 5న జరిగే టీచర్స్ డే సెలబ్రేషన్స్ వేదిక మారనున్నది. ఈ ఏడాది రవీంద్రభారతిలో కాకుండా మాదాపూర్లోని శిల్పాకళావేదికలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి అటెండ్ కానున్నారు. రెండ్రోజుల క్రితం విద్యాశాఖ అధికారులతో సీఎం నిర్వహించిన సమావేశంలో వేదిక మార్పు నిర్ణయం తీసుకున్నారు.
