గుడ్ న్యూస్.. 2 లక్షల రుణమాఫీ..రైతుల ఖాతాల్లోకి 18 వేల కోట్లు

గుడ్ న్యూస్..  2 లక్షల రుణమాఫీ..రైతుల ఖాతాల్లోకి 18 వేల కోట్లు

లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు  రైతురుణాలను మాఫీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే   లక్షన్నర లోపు రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం ఇవాళ రెండు లక్షల వరకు మాఫీ చేసింది. రైతుల ఖతాల్లో 18 వేల కోట్లు డబ్బులు జమ చేసింది. ఆగస్టు 15న  ఖమ్మం జిల్లా వైరాలో  బహిరంగ సభలో సీఎం రేవంత్​రెడ్డి,  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అగ్రికల్చర్​ మినిస్టర్​ తుమ్మల నాగేశ్వరరావు బటన్​ నొక్కి నిధులను విడుదల చేశారు.. ఆ వెంటనే క్రాప్​లోన్లు ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. ఆగస్టు 15లోపు   రూ.2 లక్షల వరకు రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

జూలై 18న రుణమాఫీ ప్రారంభం కాగా మొదటి విడతలో 11లక్షల 34 వేల 412 మంది రైతుల ఖతాల్లో 6 వేల కోట్లు రుణమాఫీ చేశారు. రెండో విడతలో  6లక్షల40 వేల 823 మంది రైతుల ఖాతాల్లో 6 వేల 90 కోట్లు జమ అయ్యాయి. మొత్తం రెండు విడతల్లో కలిసి 17లక్షల 75 వేల235 మంది రైతులకు లబ్ధి చేకూరింది.  రెండు విడతల్లో  కలిసి మొత్తం 12 వేల 224 కోట్లు  జమ చేశారు. ఇవాళ మూడో విడత లక్షన్నర నుంచి రెండు లక్షల లోపు ఉన్న  రైతులకు  రుణమాఫీ చేశారు. మూడు విడుతల్లో కలిసి 31 వేల కోట్లు రుణమాఫీ చేసింది.