
- తీవ్ర ఆరోపణల నేపథ్యంలో చర్యలు తీసుకున్న సీఎం
హైదరాబాద్, వెలుగు: అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ)గా పని చేస్తున్న సుమంత్‌ను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. సుమంత్.. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి(టీజీపీసీబీ)లో కాంట్రాక్ట్ పద్ధతిలో నియమితుడు కాగా, మంత్రి పేషీకి డిప్యూటేషన్‌పై వచ్చారు. అయితే, తీవ్రమైన ఆరోపణలు, ఫిర్యాదుల నేప థ్యంలో ఆయన సేవలను తక్షణమే రద్దు చేస్తూ టీజీపీసీబీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రుల మధ్య అంతర్గత విభేదాలకు కారణమ య్యేలా సమాచారాన్ని లీక్ చేస్తున్నారనే ఫిర్యాదులు సీఎంఓ దృష్టికి వెళ్లాయి.
రాష్ట్రంలో అతి ముఖ్యమైన వేడుకగా పరిగణించే మేడారం జాతర టెండర్ల వ్యవహారంలోనూ గోల్‌మాల్ కు యత్నించారన్న ఆరోపణలు వచ్చాయి. సెటిల్మెం ట్లు చేయడంతోపాటు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఇంటెలిజెన్స్ విభాగం సమగ్ర నివేదిక సమర్పించింది. ఈ నివేదికల ఆధారంగానే సీఎం నేరుగా సుమంత్ తొలగింపునకు ఆదేశించినట్లు తెలుస్తోంది. మంత్రుల పేషీల్లో కీలక స్థానాల్లో పనిచేస్తున్న పీఎస్‌లు, ఓఎస్‌డీలు, పీఆర్‌ఓలపై వస్తున్న ఆరోపణలను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసు కుంటోంది. ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న అంతర్గత చర్చల ప్రకారం.. తొలగించాల్సిన వారి లిస్ట్‌లో మరికొందరు ఉన్నట్లుగా తెలుస్తోంది.