దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ట్రెండ్‌లోకి నటుడు ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ పార్టీకి మద్దతుగా ఆసక్తికరమైన వీడియోను షేర్ చేసి మరింత రచ్చ లేపారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మే 15న ఒక కేసు విచారణలో నిరుద్యోగ యువతను, సోషల్ మీడియా యాక్టివిస్టులను ఉద్దేశించి చేసిన ‘బొద్దింకలు’ (Cockroaches) అనే వ్యాఖ్యలు నెట్టింట కార్చిచ్చు రేపాయి. ఆ వ్యాఖ్యలపై నెటిజన్లు సీరియస్ అవ్వకుండా, డిజిటల్ స్ట్రాటజిస్ట్ అభిజీత్ దీప్కే నేతృత్వంలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అనే ఒక క్రేజీ సాటిరికల్ పొలిటికల్ మూవ్‌మెంట్‌ను సృష్టించారు.
'సీజేపీ'లోకి సెలబ్రిటీలు..
మే 16న పుట్టుకొచ్చిన ఈ ప్యారడీ పార్టీకి కేవలం 6 రోజుల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 1.9 కోట్ల (19 Million) మంది ఫాలోవర్లు చేరిపోయారంటే ఈ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అనురాగ్ కశ్యప్, దియా మీర్జా, ఈషా గుప్తా వంటి బాలీవుడ్ సెలబ్రిటీలు దీనిని ఫాలో అవుతుండగా.. ఇప్పుడు ప్రకాష్ రాజ్ షేర్ చేసిన ఒక వీడియో నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది.
Also Read : కెమెరా లేదు.. షూటింగ్ లేదు.. పూర్తిగా AIతో తెరకెక్కిన తొలి భారతీయ చిత్రం 'వాగ్దాత భూమి'!
ప్రధానిపై సెటైర్..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ప్రకాష్ రాజ్ సమ్మర్ స్పెషల్ ఐస్‌క్రీమ్‌లో మామిడి పండ్ల రసాన్ని కలుపుకుంటూ తింటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఇష్టమైన మామిడి పండ్ల ప్రస్తావన తెస్తూ.. "ఒక బొద్దింక మామిడి పండును ఎలా తింటుందో చూడండి.. యమ్మీ" అంటూ ప్రధానిపై పరోక్షంగా పొలిటికల్ సెటైర్ వేశారు. దీనికి ‘#CockroachJantaParty’, ‘#justasking’ అంటూ క్యాప్షన్లు జోడించారు.
Cockroach eating mangoes.. yummy 😜😜😜#CockroachJantaParty #justasking pic.twitter.com/8oEseWgqtF
— Prakash Raj (@prakashraaj) May 22, 2026
సిజెఐ వివరణ..
ఈ వ్యవహారం ముదరడంతో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. తాను దేశ యువతను అనలేదని, నకిలీ డిగ్రీలతో లీగల్, మీడియా రంగాల్లోకి దూరిన పరాన్నజీవులనే అలా అన్నానని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ‘సీజేపీ’ జోరు తగ్గలేదు. యువత తమను తాము ఈ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించుకుంటూ మీమ్స్ వదులుతున్నారు.
సీజేపీ మేనిఫెస్టో హల్చల్
ఈ ప్యారడీ పార్టీ మేనిఫెస్టో కూడా వినూత్నంగా ఉంది. "సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ" పార్టీగా ప్రకటించుకున్న సీజేపీ.. రిటైర్డ్ చీఫ్ జస్టిస్‌లకు రాజ్యసభ సీట్లు ఇవ్వకూడదని, చట్టసభల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాలని, పార్టీలు మారే ఎమ్మెల్యేలు, ఎంపీలపై 20 ఏళ్ల ఎన్నికల నిషేధం విధించాలంటూ క్రేజీ డిమాండ్లతో ఇంటర్నెట్‌ను దున్నేస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా సీజేపీ గురించే చర్చనీయాంశంగా మారింది.
