
- కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి పట్టణంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. బుధవారం విద్యానగర్ కాలనీలో పారిశుధ్య పనులను పరిశీలించారు. వర్షాలకు నీళ్లు బ్లాక్ అయ్యే ఏరియాల్లో డ్రైనేజీలను క్లీన్ చేయాలన్నారు. తడి, పొడి చెత్తను ఎక్కడ పడితే వేయొద్దన్నారు. భారీ వర్షాల కారణంగా అవసరమయితే తప్పా ఇండ్ల నుంచి బటయకు రావొద్దని జిల్లా ప్రజలకు సూచించారు. మున్సిపల్ కార్మికులకు పని ముట్లు, ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు వినియోగించే పరికరాలను కలెక్టర్అందించారు. అడిషనల్ కలెక్టర్ చందర్‌నాయక్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి ఉన్నారు.
మాదవ ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
కామారెడ్డి : విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. బుధవారం నషాముక్త్ భారత్ అభియాన్‌ను పురష్కరించుకొని కామారెడ్డి డిగ్రీ కాలేజీలో సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ హనుమంత్‌రావు, జిల్లా వెల్ఫేర్ అధికారి ప్రమీల, ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్ ఉన్నారు.
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం..
నషా ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఎస్పీ రాజేశ్చంద్ర సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. ఏఎస్పీ చైతన్యారెడ్డి, టౌన్ సీఐ నరహరి, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీధర్ ఉన్నారు.