వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
  • కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్​

కామారెడ్డి, వెలుగు : జిల్లాలో వర్షాలు కురుస్తున్న తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. శుక్రవారం పాల్వంచ మండలం భవానిపేట నుంచి పోతారం గ్రామానికి వెళ్లే మార్గంలోని వాగును కలెక్టర్​ పరిశీలించి మాట్లాడారు. వరద ఉధృతి పెరిగి వంతెనపై నుంచి నీళ్లు వెళితే రాకపోకలు నిలిపి వేయాలని అధికారులను  ఆదేశించారు. వర్షాలతో ప్రజలు ప్రమాదాలకు గురికాకుండా జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అధికారులు అలర్ట్​గా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. అడిషనల్ కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, ఆర్అండ్​బీ ఈఈ మోహన్​ తదితరులు పాల్గొన్నారు.   

‘ఇందిరమ్మ’ నిర్మాణాలు పూర్తి చేయాలి సదాశివనగర్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్​ ఆశిష్​సంగ్వాన్ అన్నారు. శుక్రవారం రామారెడ్డి మండలంలోని రంగంపేట్ గ్రామంలో  ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం రామారెడ్డి మండల కేంద్రంలో రేషన్ కార్డులను పంపిణీ చేసి మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక, మొరం, ఇటుకలను అందుబాటులో ఉంచామని లబ్ధిదారులు త్వరగా పూర్తి చేయాలన్నారు. హౌసింగ్ పీడీ విజయ పాల్, మండలాధికారులు ఉన్నారు.