
సిద్దిపేట రూరల్, వెలుగు: ఇందిరమ్మ లబ్ధిదారులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఇంటిని నిర్మించుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు. మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్ లో జనగామ నియోజక వర్గ పరిధిలోని 415 మంది లబ్ధి దారులకు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్పత్రాలను అందజేశారు. చేర్యాల 160, కొమురవెల్లి 84, ధూల్మిట్ట 76, మద్దూర్ మండలానికి 95 ప్రొసీడింగ్స్పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటి నిర్మాణానికి సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేయాలన్నారు.
ఆర్థిక స్తోమత పేద లబ్ధిదారులకు ఎస్ హెచ్ జీల ద్వారా ఆర్థిక సాయం అందించడంతో పాటు, ఇసుక సమస్య తలెత్తకుండా చూస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, హౌసింగ్ పీడీ దామోదర్ రావు, ఆయా మండలాల అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అనంతరం జనగామ నియోజకవర్గ లబ్ధిదారులు, బీఆర్ఎస్ నాయకులు కలెక్టరేట్ ఆవరణలో సంబరాలు జరుపుకున్నారు. కేసీఆర్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు ఫొటోలకు క్షీరాభిషేకం నిర్వహించారు.
గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లు చేయాలి
కోహెడ : ఈ నెల 17న కోహెడలో గవర్నర్ జిష్టుదేవ్ వర్మ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్హైమావతి అధికారులను ఆదేశించారు. కోహెడ సబ్స్టేషన్పక్కన ఏర్పాటు చేసే సభా స్థలాన్ని పరిశీలించారు. అతిథుల స్టేజ్, వీవీఐపీ, వీఐపీ గ్యాలరీ ఏర్పాటు, పార్కింగ్, బారికేడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. స్థానిక గురుకుల స్కూల్లో తాత్కాలిక హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని ఆర్అండ్ బీ అధికారులను ఆదేశించారు.
అనంతరం మండలంలోని బస్వాపూర్‌లో మంత్రుల ఆధ్వర్యంలో 50 ఎకరాల విస్తీర్ణంలో మెగా అయిల్‌పామ్ మొక్కలు నాటే కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. ఆమె వెంట అడిషనల్కలెక్టర్గరిమ అగర్వాల్, ఆర్డీవో రామ్మూర్తి, డీఆర్డీవో జయదేవ్ ఆర్య, డీపీవో దేవకీదేవి, ఏసీపీ సదానందం, తహసీల్దార్అహ్మద్ఖాన్, ఎంపీడీవో కృష్ణయ్య, ఎంపీవో శోభ ఉన్నారు.