V6 News

పోలింగ్ సక్రమంగా జరిగేలా చూడాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

పోలింగ్ సక్రమంగా జరిగేలా చూడాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
  • కేతేపల్లిలో పోలింగ్ కేంద్రం పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నకిరేకల్, వెలుగు: గ్రామ పంచాయతీ  ఎన్నికల నేపథ్యంలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం ఆమె శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో కేతేపల్లి మండల కేంద్రంలో డీ పౌల్ పాఠశాలలో  ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్  రిసెప్షన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు.  ఎన్నికల పోలింగ్ సామాగ్రిని ,పోస్టల్ బ్యాలెట్ పత్రాలను, పోలింగ్ బాక్సులను పరిశీలించారు. పోలింగ్  ఏర్పాట్లపై అధికారులతో  వివరంగా అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు  వినియోగించుకునేందుకు ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు సరైన పద్ధతుల్లో పని చేయాలన్నారు. 

పోలింగ్ సిబ్బందికి అవసరమైన సామాగ్రి పంపిణీ ఆలస్యం లేకుండా నిర్వహించాలని, పోలింగ్ మెటీరియల్ పంపిణీ, స్వీకరించే ప్రక్రియలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి స్పష్టమైన మార్గ దర్శకాలు ఇవ్వాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు నిరంతరం ఉండాలన్నారు.  ఇన్ , అవుట్ గేట్ల  వద్ద క్యూలైన్ వ్యవస్థను అమలు చేయాలని, సీసీ కెమెరాలు ద్వారా నిరంతరం పర్యవేక్షించే విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించకుండా ప్రతి అధికారి తన బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వహించాలన్నారు.

 తాగునీరు, వసతులు, వైద్య సౌకర్యాలు ర్యాంపులు, లైటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు.  జడ్పీ సీఈఓ శ్రీని వాస్ రావు, జిల్లా పంచాయతీ రాజ్ అధికారి వెంకటయ్య, నల్గొండ ఆర్డీవో  వై. అశోక్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, శాలిగౌరారం తహసీల్దార్ వరప్రసాద్, కేతే పల్లి తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీవో జ్యోతిలక్ష్మి తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.