V6 News

స్కాలర్షిప్ పేద విద్యార్థులకు భరోసా : కలెక్టర్ ఇలా త్రిపాఠి

స్కాలర్షిప్  పేద విద్యార్థులకు భరోసా : కలెక్టర్ ఇలా త్రిపాఠి
  • కలెక్టర్ ఇలా త్రిపాఠి

చిట్యాల, వెలుగు : ప్రభుత్వం అందించే స్కాలర్​షిప్ పేద విద్యార్థుల భవిష్యత్ కు భరోసా లాంటిదని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్​లో ప్రీ మెట్రిక్ స్కాలర్​షిప్​పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ  సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం అందించే వివిధ రకాల స్కాలర్​షిప్​ పథకాల అమలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపకార వేతనాల వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు.  షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్​తెగలు, సామాజిక-ంగా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు స్కాలర్​ షిప్స్​ ఎంతో అవసరమన్నారు. 

తహసీల్దార్లు త్వరగా విద్యార్థులకు కులధ్రువీకరణ పత్రాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇప్పటివరకు 50 శాతం టార్గెట్ పూర్తి చేసిన మండలాలు 100% దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. స్కాలర్​షిప్​మంజూరులో జాప్యం తగదన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఈవో భిక్షపతి, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి శశికళ, ఎంఈవోలు, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖల అధికారులు, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రామిక్ తదితరులు 
పాల్గొన్నారు.