
నిజామాబాద్, వెలుగు : బియ్యం గోదాములను అన్ని శాఖలు పరిశీలించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. గురువారం నగరంలోని మార్కెట్ కమిటీ, స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములను కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. వర్షాలు కురుస్తున్నందున గోదాముల్లో లీకేజీలు లేకుండా చూడాలని, వడ్లు, బియ్యం బస్తాలపై టార్ఫాలిన్లు కప్పాలన్నారు.
కొనుగోలు కేంద్రాల్లోని వడ్ల బ్యాగులను మిల్లర్ల వద్దకు చేర్చాలని, లారీలు, లోడింగ్, అన్లోడింగ్, హమాలీల కొరత లేకుండా చూడాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ వెంట డీఎస్వో అరవింద్‌రెడ్డి, డీఎం శ్రీకాంత్‌రెడ్డి, మార్కెట్ సెక్రటరీ అపర్ణ, గోదామ్ మేనేజర్ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.