డాక్టర్లు సేవాభావంతో పని చేయాలి : కలెక్టర్ జితేష్

డాక్టర్లు సేవాభావంతో పని చేయాలి  : కలెక్టర్ జితేష్
  • కలెక్టర్ ​జితేష్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : డాక్టర్లు సేవాభావంతో  పని చేయాలని కలెక్టర్ జితేష్​వి.పాటిల్​అన్నారు. సోమవారం పాల్వంచలోని ప్రభుత్వ మెడికల్​ కాలేజీలో నిర్వహించిన వైట్​కోట్​ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు. వైద్య వృత్తి మానవ సేవకు ప్రతీక అని తెలిపారు. వైద్య వృత్తి అనేది ప్రభుత్వ ఉద్యోగం కాదన్నారు. రోగుల పట్ల డాక్టర్లు కరుణ, సేవా నీరతి కలిగి ఉండాలని, అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. 

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించేందుకు వైద్యులు ముందుకు రావాలని కోరారు. అనంతరం స్టూడెంట్స్ కు వైట్ కోట్స్ అందించారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్​శ్రీహరిరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్​ రాధామోహన్​  పాల్గొన్నారు.