
కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను జిల్లాలోని భవిత కేంద్రాలకు పంపించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. శుక్రవారం సిటీలోని ముఖరంపుర భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు ఉన్న 38 మంది పిల్లల తల్లిదండ్రులకు టీఎల్ఎం కిట్లను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అలీం కో సంస్థ ద్వారా గతంలో ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల కోసం క్యాంపు నిర్వహించినట్లు తెలిపారు. పిల్లల మానసిక స్థితిని బట్టి 38 మందికి లెర్నింగ్ మెటీరియల్ అందించామన్నారు.
అంతకుముందు సిటీలోని రాజీవ్ నగర్ అంగన్వాడీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన శుక్రవారం సభకు కలెక్టర్ హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ శుక్రవారం సభ ద్వారా మహిళల హక్కులు, చట్టాలు, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తారన్నారు. కార్యక్రమంలో డీఈవో మొండయ్య, డీడబ్ల్యూవో సరస్వతి, అడిషనల్ డీఎంహెచ్‌వో సుధ, ప్రోగ్రాం ఆఫీసర్ సనా, సీడీపీవో సబిత, విద్యాశాఖ కోఆర్డినేటర్లు శ్రీనివాస్, ఆంజనేయులు, అశోక్ రెడ్డి, జిల్లా బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి, డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ జయపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.