
రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు కుడివైపు బైపాస్‌లో సెంట్రల్ లైటింగ్ పనులను పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. శుక్రవారం రగుడు జంక్షన్ నుంచి వెంకటాపూర్ రోడ్డులో 11 కిలోమీటర్లు మేర ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను కేకే మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రగుడు జంక్షన్ నుంచి వెంకటాపూర్ రోడ్డులో రగుడు, చంద్రంపేట, చిన్న బోనాల, పెద్ద బోనాల, పెద్దూర్ వరకు సెంట్రల్ లైటింగ్ పనులను సీడీఎంఏ నిధులు రూ.4.60 కోట్లతో చేపట్టినట్లు చెప్పారు. పనులు త్వరితగతిన పూర్తి చేసిన అధికారులను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ స్వరూపారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా, ప్రజాప్రతినిధులు, లీడర్లు పాల్గొన్నారు.