నులి పురుగుల నిర్మూలనకు అల్బెండజోల్ మాత్రలు : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

నులి పురుగుల నిర్మూలనకు అల్బెండజోల్ మాత్రలు :  కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
  •  కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్నసిరిసిల్ల, వెలుగు: నులిపురుగుల నిర్మూలన కోసం అల్బెండజోల్ మాత్రలు అందజేయాలని కలెక్టర్ సందీప్‌‌‌‌‌‌‌‌కుమార్ ఝా అన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమ నిర్వహణపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పలు విద్యాసంస్థల్లో చదువుతున్న 1 నుంచి 19 ఏండ్లలోపు విద్యార్థులందరికీ అల్బెండజోల్‌‌‌‌‌‌‌‌ మాత్రలు పంపిణీ చేయాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో రజిత, వేములవాడ ఏరియా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ సూపరింటెండెంట్ పెంచలయ్య, డీఈవో  వినోద్ కుమార్, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం పాల్గొన్నారు.

జగిత్యాల టౌన్, వెలుగు: ఈనెల 11న జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం సందర్భంగా 1 నుంచి 19 ఏండ్ల లోపు పిల్లలందరికీ తప్పకుండా ఆల్బెండజోల్ మాత్రాలు వేయించాలని అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 2,175 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో డీఈవో డా.ప్రమోద్ కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.