
- కలెక్టర్ సంతోష్
గద్వాల, వెలుగు: ప్రతి గ్రామంలో డిజిటల్ యాప్ ద్వారా పంటకోత ప్రయోగాలను పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో భారత ప్రభుత్వం రూపొందించిన డిజిటల్ యాప్ ద్వారా పంట కోత ప్రయోగాలను నిర్వహించే విధానంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ప్రాథమిక కార్యకర్త (ఎంపీ ఎస్ ఓ) ఏఈవోలు వారికి కేటాయించిన గ్రామాలలో ఎటువంటి పొరపాటు లేకుండా పంట కోత ప్రయోగాలను నిర్వహించాలన్నారు. వాటిని యాప్ లో తప్పనిసరిగా అప్ లోడ్ చేయాలన్నారు.
ప్రతి గ్రామంలో పంట కోత ప్రయోగాలు, డిజిటల్ క్రాప్ బుకింగ్, యూరియా సరఫరాను పక్కాగా నిర్వహించాలని కోరారు. ప్రణాళిక అధికారి యోగానంద్, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ సక్రియ నాయక్, ఏడిఏ సంగీతలక్ష్మి, గణాంకాల అధికారి నాగార్జున్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మహిళా సంఘాల ఉత్పత్తులను కొనుగోలు చేయాలి
గ్రామీణ మహిళ స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ సంతోష్ కోరారు. ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన స్వయం సహాయక సంఘాల ఆకాంక్ష హాట్- ఎగ్జిబిషన్ అండ్ సేల్ ప్రోగ్రాంలో పాల్గొని స్టాళ్లను పరిశీలించారు. వారి ఉత్పత్తులను కొనుగోలు చేస్తే మహిళాలు ఆర్థికంగా ఎదగడానికి తోడ్పాటు అందుతుందన్నారు. టీ కప్పులు, పేపర్ ప్లేట్లు, పర్యావరణ రహిత వినాయక విగ్రహాలను పరిశీలించి అభినందించారు. అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, ఏపీడి శ్రీనివాసు, ఎంపీడీవో చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.