పంచాయతీ ఎలక్షన్కు రెడీగా ఉండాలి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

పంచాయతీ ఎలక్షన్కు రెడీగా ఉండాలి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి
  • కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి

నిజామాబాద్, వెలుగు : రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్ నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి కోరారు.  గురువారం సీఈసీ కమిషనర్ రాణి కుముదిణి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా ఆఫీసర్లతో కలెక్టర్​మాట్లాడారు. నోటిఫికేషన్​ రిలీజ్ మొదలుకొని మొత్తం ప్రక్రియ ముగిసేదాకా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సొంత నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. సీపీ సాయిచైతన్య, అడిషనల్​కలెక్టర్​ అంకిత్, సబ్​ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, డీపీవో శ్రీనివాస్​రావు, డీఈవో అశోక్ నోడల్ ఆఫీసర్లు ఉన్నారు.  

పంచాయతీ ఎలక్షన్​కు పరిశీలకుల నియామకం

 గ్రామ పంచాయతీ ఎలక్షన్​ కోసం ప్రభుత్వం జిల్లాకు ఇద్దరు పరిశీలకులను నియమించిందని కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నికల సాధారణ పరిశీలకుడిగా జి.వి.శ్యాంప్రసాద్​లాల్​, వ్యయ పరిశీలకుడిగా జె.కిషన్​పమర్​ను నియమించినట్లు తెలిపారు.