
- కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్, వెలుగు : విధుల్లో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అన్ని శాఖల అధికారులను హెచ్చరించారు. బుధవారం నిజామాబాద్ రూరల్ మండలం తిర్మన్‌పల్లి గ్రామానికి వెళ్లగా ఏఈవో అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ గోవింద్‌కు ఫోన్ చేసి రప్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాలపై అలర్ట్ చేసినా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం పాల్దా ప్రైమరీ స్కూల్ విజిట్ చేశారు.
30 మంది విద్యార్థులకు 25 మంది ఫేసియల్ అటెండెన్స్ ఉండడంపై హెచ్ఎం సుమన్రెడ్డిపై అసహనం వ్యక్తం చేశారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే సరి చేయాలని డీఈవో అశోక్‌ను ఆదేశించారు. మధ్యాహ్న భోజనాన్ని చెక్ చేశారు. స్కూల్లోని ఇంకుడు గుంతను వాడకంలోకి తేవాలని సూచించారు. సింగిల్ విండో గోదాంకు వెళ్లి యూరియా నిల్వలపై ఆరా తీశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, నర్సరీల నిర్వహణను పరిశీలించారు. తిర్మన్‌పల్లి ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి డాక్టర్లకు సూచనలు చేశారు.