నా కర్తవ్యం అలాగే ఉంటుంది.. దేశాన్ని రక్షించాలన్నదే నా ఆలోచన

నా కర్తవ్యం అలాగే ఉంటుంది.. దేశాన్ని రక్షించాలన్నదే నా ఆలోచన

2019 ఎన్నికల ర్యాలీలో "మోదీ ఇంటిపేరు" వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి విధించిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దాంతో పాటు ఆయన ఎంపీగా పునరుద్దరిస్తున్నట్టు తీర్పు వెలువరించింది. ఈ ప్రకటనపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ఓ ఆసక్తికర ట్వీట్ తో వచ్చారు. తన కర్తవ్యం అలాగే ఉందని రాసుకువచ్చారు.

"ఏమైనప్పటికీ, నా కర్తవ్యం అలాగే ఉంటుంది. దేశాన్ని రక్షించాలన్నదే నా ఆలోచన" అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే పార్టీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే కూడా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. సత్యం ఒక్కటే గెలుస్తుందని, ఎట్టకేలకు న్యాయం జరిగిందని, ప్రజాస్వామ్యం నెగ్గిందని చెప్పుకొచ్చారు. రాహుస్ పై బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బట్టబయలైందని, విపక్షాలను లక్ష్యంగా చేసుకుని చేసే దుర్మార్గపు రాజకీయాలను ఇకనైనా ఆపేయాలంటూ ఆయన ట్విట్టర్ ద్వారా హెచ్చరించారు.

దీంతో పాటు నిజం మాట్లాడేవారు ఎవరికీ, దేనికీ భయపడరు. జనాల మధ్య తిరిగి వాళ్ల కష్ట సుఖాలు తెలుసుకునే వాడు రాజు కంటే గొప్పవాడవుతాడంటూ కాంగ్రెస్ కూడా వరుస పోస్టులు పెడుతూ.. రాహుల్ గాంధీకి తన మద్దతు ప్రకటిస్తోంది.