రాష్ట్రంలో ఫేక్ డాక్టర్లు ఎక్కువయ్యరు. కొన్నేళ్ల క్రితమే ఫేక్ డాక్యుమెంట్స్ తో తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి నుంచి గుర్తింపు పొంది డాక్టర్లుగా కొనసాగుతున్నారు. ఇటీవల TSMC జరిపిన పరిశీలనలో నకిలీ డాక్యుమెంట్లతో నలుగురు వ్యక్తులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు వెల్లడైంది. దీంతో సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్. కొందరు విదేశాల్లో MBBS చదివిన విద్యార్థులు.. కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ నంబర్లను దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. నలుగురు విద్యార్థులకు సంబంధించిన ఆధారాలు , వివరాలు పోలీసులకు అందజేశారు రిజిస్ట్రార్. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
