V6 News

మా వాటా సీట్లు మాకు ఇవ్వాల్సిందే.. పీసీసీకి బీసీ నేతల అల్టిమేటం

మా వాటా సీట్లు మాకు ఇవ్వాల్సిందే.. పీసీసీకి బీసీ నేతల అల్టిమేటం

కాంగ్రెస్ పార్టీకి బీసీ నేతలు అల్టిమేటం జారీ చేశారు. పీఏసీ సమావేశంలో బీసీలకు ఇస్తామన్న 34 స్థానాలు ఇవ్వాలని కోరారు. అక్టోబర్ 13వ తేదీన గాంధీ భవన్లో బీసీ నేతలంతా దీక్ష చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీసీ నేతలే కాకుండా సామాజిక న్యాయం కోరుకునే ఎవరైనా ఈ దీక్షలు పాల్గొనవచ్చన్నారు. 

అక్టోబర్ 12వ తేదీన హలో బీసీ..ఛలో గాంధీ భవన్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు ఓబీసీ కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా గాంధీ భవన్ లో దీక్ష చేస్తామన్నారు. ఈ దీక్షలు బీసీ నేతలతో పాటు..సామాజిక న్యాయం కోరుకునే వారు పాల్గొనాలని కోరారు. బీసీలకు ఇస్తామన్న స్థానాలు ఇవ్వకపోతే కాంగ్రెస్ అధికారంలోకి రాదని హెచ్చరించారు.  

టికెట్ల విషయంలో ఎవరు  ఎన్ని డిమాండ్స్ పెట్టినా.. అందరి లక్ష్యం కాంగ్రెస్ గెలుపే అన్నారు బీసీ నేత కత్తి వెంకటస్వామి. ఓబిసి ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నప్పుడే కాంగ్రెస్ గెలుపు అవకాశాలు సులువు అవుతాయని చెప్పారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 2 అసెంబ్లీ  టికెట్ల చొప్పున బీసీలకు ఇస్తామని  పీఏసీలో తీర్మానం చేశారని గుర్తు చేశారు. 34 స్థానాలు ఇస్తారని ఆశ కలిగిందన్నారు.  మొదటి విడతలో 72 స్థానాలు ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయని...అందులో కనీసం బీసీలకు  10 కూడా లేవని సమాచారం ఉందన్నారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ సీటు లాంటివి ఇస్తామంటే ప్రజలు నమ్మరని  చెప్పారు. 

ALSO READ : Cricket World Cup 2023: రెడీ అంటున్న పందెం రాయుళ్లు: ఇండియా- పాక్ మ్యాచ్‌పై జోరుగా బెట్టింగ్