కామారెడ్డిటౌన్, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం ఓ ఇంట్లో వంట చేస్తుండగా, గ్యాస్ లీకైముగ్గురికి గాయాలయ్యాయి. జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్ కాలనీలో ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీక్ అయింది.
మంటలు చెలరేగడంతో మల్లవ్వ, మౌనిక, ఆలేఖ్యకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బందిచేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. మంటలు అదుపులోకి రావడంతో భారీ ప్రమాదం తప్పింది.
