ఎస్సారెస్పీలో గల్లంతైన యువకుడి డెడ్ బాడీ లభ్యం.. నిజామాబాద్కు చెందిన వ్యక్తి

ఎస్సారెస్పీలో గల్లంతైన యువకుడి డెడ్ బాడీ లభ్యం.. నిజామాబాద్కు చెందిన వ్యక్తి

బాల్కొండ, వెలుగు : ఎస్సారెస్పీ బ్యాక్‌‌‌‌‌‌‌‌వాటర్ లక్ష్మీ హెడ్ రెగ్యులేటర్ వద్ద గల్లంతైన యువకుడి డెడ్ బాడీ సోమవారం దొరికింది. నిజామాబాద్ పట్టణంలోని ఆటో నగర్ కు చెందిన ఐదుగురు యువకులు ఆదివారం ఎస్సారెస్పీ వద్దకు వెళ్లగా.. ఈత కొట్టేందుకు నీటిలోకి దిగిన నలుగురు యువకులు ప్రమాదవశాత్తు మునిగి గల్లంతయ్యారు. 

అదే రోజు నీటిలో గాలించి కలీం, అమ్ము, అర్హన్ డెడ్ బాడీలను వెలికితీయగా చీకటి పడడంతో రెస్క్యూ నిలిపివేశారు. సోమవారం ఉదయం మరోసారి నీటిలో గాలించగా.. అజీమ్ ఖాన్ (24) డెడ్ బాడీ దొరికినట్లు మెండోరా ఎస్సై సుహాసిని తెలిపారు.