వరంగల్ జైల్ను ​కుదువ పెట్టిన్రు.. రూ.1,150 కోట్ల అప్పు తెచ్చారు

వరంగల్ జైల్ను ​కుదువ పెట్టిన్రు..  రూ.1,150 కోట్ల అప్పు తెచ్చారు

వరంగల్: వరంగల్ సెంట్రల్ జైల్ స్థలాన్ని కుదవపెట్టి సీఎం కేసీఆర్ రూ.1,150 కోట్లు అప్పు తీసుకువచ్చారని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఆరోపించారు. హనుమకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు. గతంలో తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో లక్షల కోట్ల రుణాలు తీసుకొచ్చిన కేసీఆర్.. సరికొత్తగా వరంగల్ సెంట్రల్ జైలు స్థలాన్ని కుదువబెట్టి వందల కోట్ల రూపాయలు లోన్ తీసుకొచ్చారని చెప్పారు.

తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ డాక్టర్ రమేశ్ రెడ్డి పేరు మీద స్థలాన్ని మార్టిగేజ్ చేసి.. శివాజీ నగర్ పూణే బ్రాంచ్ నుంచి 2022 సెప్టెంబర్ 1న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో రూ.1150 కోట్లు అప్పు తెచ్చాడని ఆరోపించారు. ఆధారాలతో సహా నిరూపించటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు బక్క జడ్సన్ వెల్లడించారు.