V6 News

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : ఆడే గజేందర్

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : ఆడే గజేందర్

నేరడిగొండ , వెలుగు: గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర  ప్రభుత్వం కృషి చేస్తోందని కాంగ్రెస్​బోథ్ నియోజకవర్గ ఇన్ చార్జి ఆడే గజేందర్ అన్నారు. ఇచ్చోడ మండలం కామగిరిలో సర్పంచ్ గా నిమ్మల సుప్రియ, ఉప సర్పంచ్ గా కనక విజయ్ కాంత్ విజయం సాధించారు. ఈ సందర్భంగా సర్పంచ్​భర్త సుధాకర్​రెడ్డి, ఉపసర్పంచ్​విజయ్​కాంత్​నేరడిగొండ మండల కేంద్రంలోని క్యాంప్ ఆఫీస్ లో శుక్రవారం గజేందర్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వారిని శాలువాలతో సత్కరించారు. కామగిరి అభివృద్ధికి తన సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు విద్యాసాగర్ రెడ్డి , నక్కల రమణారెడ్డి , నిమ్మల పోతారెడ్డి తదితరులు పాల్గొన్నారు .

కోకస్ మన్నూర్​ అభివృద్ధికి కృషి చేస్తా

కోకస్ మన్నూర్ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్ చార్జి ఆడే గజేందర్ అన్నారు. ఇచ్చోడ మండలంలోని కోకస్ మన్నూర్ సర్పంచ్​గా గెలిచిన షేక్ షమీన్ భాను శుక్రవారం నేరడిగొండ క్యాంప్ ఆఫీస్ లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గజేందర్​ఆమెను సత్కరించారు.