దళితులకు రక్షణ కల్పించండి.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు మల్లు రవి లేఖ

దళితులకు  రక్షణ కల్పించండి..  ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు మల్లు రవి లేఖ
  •  ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు మల్లు రవి లేఖ

న్యూఢిల్లీ, వెలుగు: దళితులకు రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎంపీ ల ఫోరం తెలంగాణ కన్వీనర్ మల్లు రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవా రం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖలు రాశారు. సుప్రీంకోర్టు సాక్షిగా సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్​పై దాడి, సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలు దళితుల భద్రతను ప్రశ్నార్థకంగా మార్చాయని తెలిపారు. 

ఈ ఘటనలు ఎంతోకాలంగా దళితుల్లో నెలకొన్న ఆందోళన, భయం, బాధ, నిరాశలను ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. వీటికి చెక్ పెట్టేలా సివిల్ సర్వీసుల్లో దళితులు ఎదుర్కొంటున్న వ్యవస్థాగత సవాళ్లను గుర్తించడానికి, పరిష్కార మార్గాలను సూచించడానికి ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దళితుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి జాతీయ స్థాయిలో చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.  దళితుల్లో నమ్మకాన్ని కలిగించడానికి తక్షణ చర్యలు అవసరమని మల్లు రవి లేఖలో పేర్కొన్నారు.