అశ్వారావుపేట/ దమ్మపేట, వెలుగు: కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గాంధీ పేరు తొలగించటాన్ని నిరసిస్తూ ఆదివారం అశ్వారావుపేట, దమ్మపేట మండలాలలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహాలకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతిపిత అయిన మహాత్మా గాంధీ పేరు తొలగింపు ప్రజా వ్యతిరేక చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సుంకపల్లి వీరభద్రరావు, అశ్వారావుపేట, దమ్మపేట కాంగ్రెస్ మండల అధ్యక్షులు తుమ్మ రాంబాబు, మద్దిశెట్టి సత్యప్రసాద్, చిన్నంశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.
పాల్వంచలో కాంగ్రెస్ నిరసన
పాల్వంచ : మహాత్మా గాంధీ ఉపాధి హామీ పేరులో మహాత్మా గాంధీ పేరు తొలగింపును నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వ ర్యంలో ఆదివారం పాల్వంచలోని మార్కెట్ ఏరియాలో ఉన్న మహా త్మా గాంధీ విగ్రహం వద్ద నాయకు లు గాంధీ ఫొటోలతో నిరసన తెలిపారు. ఈ సంద ర్భంగా పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్, రా ష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న చర్యలను ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొండం వెంకన్న, ఎల్ డీఎం కోఆర్డినేటర్ బద్దికిషోర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పైడిపల్లి మ హేశ్ తదితరులు పాల్గొన్నారు.
