కేసీఆర్.. బనకచర్లపై మాట్లాడవేం? : ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

కేసీఆర్.. బనకచర్లపై మాట్లాడవేం? : ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
  • కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్  నిలదీత

హైదరాబాద్, వెలుగు: బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్  అధినేత కేసీఆర్ ఎందుకు నోరు విప్పడం లేదని కాంగ్రెస్  ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్  ప్రశ్నించారు. శుక్రవారం సీఎల్పీలో మీడియాతో  అద్దంకి మాట్లాడారు. ‘నీటి విషయంలో తెలంగాణకు ఎలాంటి  బేసిన్లు లేవు, భేషజాలు లేవు’ అని కేసీఆర్  నాడు ఇష్టానుసారం మాట్లాడారని, ఇప్పుడు కాంగ్రెస్  ప్రభుత్వంపై బీఆర్ఎస్  నేతలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బనకచర్లకు అవకాశం ఇచ్చిందే కేసీఆర్. 

నాడు ఆయన కళ్లు మూసుకొని కూర్చొని, ఇప్పుడు అవకాశవాదంతో మాట్లాడితే ఎలా? రాయలసీమను రతనాల సీమ చేస్తానని అనలేదా? రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిని నోటికొచ్చింది మాట్లాడలేదా? అప్పటి సీఎం జగన్ తో స్నేహం చేసి, నాలుగుసార్లు ప్రగతి భవన్ కు పిలిచింది నిజం కాదా? ఆనాడు అధికారంలో ఉండి తెలంగాణ జల వనరులను ఆంధ్రాకు తాకట్టుపెట్టి, ఇప్పుడు నీతి వ్యాక్యాలు పలుకుతున్నారు” అని అద్దంకి విమర్శించారు.