ప్రకృతిని కూడా ప్రేమించేటోళ్లనే లైఫ్​ పార్ట్​నర్​గా..

ప్రకృతిని కూడా ప్రేమించేటోళ్లనే లైఫ్​ పార్ట్​నర్​గా..

ఒకప్పటి యూత్​ ప్రేమ, ఫ్యూచర్​ ప్లాన్స్​ గురించే ఎక్కువగా మట్లాడుకునేవాళ్లు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇష్టాలు, అలవాట్లు మ్యాచ్​ అవ్వడంతో పాటు ప్రకృతిని ప్రేమించే వాళ్లతోనే మాట కలుపుతున్నారు. కొందరైతే అటువంటి వాళ్లనే లైఫ్​ పార్ట్​నర్​గా కోరుకుంటున్నారు.

ఈ మార్పు ఎలా వచ్చిందో తెలుసా.. 
కరోనా టైంలో అందరికీ పర్యావరణ సోయి పెరిగింది. గార్డెనింగ్​, వీగనిజం దిశగా మారే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఈ విషయం ‘టిండర్​ ఇండియా’ అనే డేటింగ్​ యాప్ సర్వేలో తెలిసింది. ఈ కాలం అమ్మాయిలు, అబ్బాయిలు లైక్​మైండెడ్​ వాళ్లనే లైఫ్​లోకి ఆహ్వానిస్తున్నారు. కాలుష్యానికి కారణమయ్యే లైఫ్​స్టైల్​ని అనుసరించే వాళ్లకి ‘నో’ అంటున్నారు. ప్రకృతి మీద ప్రేమ ఉన్నవాళ్లకు, ఎక్కువగా వెజ్​ ఫుడ్​​ తినేవాళ్లకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇదే కాకుండా రీసైక్లింగ్, స్లో ఫ్యాషన్, వాటర్​ కన్జర్వేషన్​ మీద కూడా చర్చిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ప్రకృతిని ప్రేమించే వాళ్లనే  లైఫ్​ పార్ట్​న​ర్​గా కోరుకుంటున్నారు. డేటింగ్ యాప్స్​లో అబ్బాయిలు ‘ప్లాంట్ డాడ్’ అని రాయడం ఇప్పుడు మూడు రెట్లు పెరిగింది. అమ్మాయిలు కూడా తమ బయోని ‘ప్లాంట్​ మామ్​’ అని ఎడిట్​ చేయడం రెండింతలు పెరిగింది. 
ఎకోఫ్రెండ్లీ రూల్స్​లో​ కొన్ని ఇవి...
  నాది వెజి​టేరియన్​ లైఫ్​స్టైల్​. 
  నీకు ఇష్టమైన పువ్వు ఏది? నీకోసం నేను ఆ పూల మొక్క పెంచుతా.
  ముగ్గురు పిల్లలకు (లిల్లీ మొక్కలు) సింగిల్​ పేరెంట్​గా ఉన్నందుకు గర్వంగా ఫీలవుతున్నా. 
  అన్ని సమస్యల్ని మర్చిపోయి మొక్కల్ని పెంచండి.
  ‘నాకు స్లో, సస్టెయినబుల్​ ఫ్యాషన్​ అంటే చాలా ఇష్టం. అలానే రిలేషన్​షిప్స్ అంటే కూడా చాలా చాలా ఇష్టం. చెత్తని రీయూజ్, రెడ్యూస్​, రీసైకిల్​ చేస్తాను.