కొత్త కేసులు 18 వేలే: 7 నెలల్లో ఇదే తక్కువ

కొత్త కేసులు 18 వేలే:  7 నెలల్లో ఇదే తక్కువ

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. 7 నెలల తర్వాత అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 18,346 కేసులు రికార్డయ్యాయని, మొత్తం కేసుల సంఖ్య 3.38 కోట్లకు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. కరోనాతో మరో 263 మంది చనిపోయారని, దీంతో మృతుల సంఖ్య 4,49,260కి చేరిందని తెలిపింది. యాక్టివ్ కేసులూ తగ్గుతున్నాయని, ప్రస్తుతం 2,52,902 ఉన్నాయని చెప్పింది. 7 నెలల తర్వాత ఇంత తక్కువకు చేరాయంది. సోమవారం 11,41,642 టెస్టులు చేశామని, మొత్తం టెస్టుల సంఖ్య 57.53 కోట్లకు చేరిందని పేర్కొంది. డైలీ పాజిటివిటీ రేటు 1.61 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేటు 1.66 శాతంగా, రికవరీ 97.93 శాతంగా, డెత్ రేటు 1.33 శాతంగా ఉందంది.కాగా, వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 91.54 కోట్ల టీకా డోసులను వేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
రష్యాలో హయ్యెస్ట్ డెత్స్... 
రష్యాలో కరోనా డెత్స్ పెరుగుతున్నాయి. మంగళవారం 25 వేల కేసులు నమోదు కాగా, 895 మంది చనిపోయారు. దేశంలో ఇప్పటి వరకు ఇవే అత్యధిక డైలీ డెత్స్ అని అధికారులు చెప్పారు. ఇదే నెలలో ఇంతకుముందు 890, 887 డెత్స్ నమోదయ్యాయని తెలిపారు.