ముంబై సీబీఐ ఆఫీసులో కరోనా కలకలం

ముంబై సీబీఐ ఆఫీసులో కరోనా కలకలం

68మంది సీబీఐ సిబ్బందికి కరోనా
ముంబయి:
మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబయి నగరంలోనే 20 వేల 318 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఐదుగురు చనిపోయారు. బాంద్రాలోని సీబీఐ కార్యాలయంలో కరోనా పరీక్షలు నిర్వహించగా  68 మంది సీబీఐ స్టాఫ్ కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.  ప్రస్తుతం ముంబయి నగరంలో 1 లక్షా 6వేల 37 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 
ముంబయి వెలుపల మహారాష్ట్ర పరిధిలో గడచిన 24 గంటల్లో 41 వేల 434 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 9,671 మందికి కరోనా నిర్ధారణ అయింది. మరో 13 మంది కరోనా బారిన పడి చికిత్స ఫలించక మృతి చెందారు. 
పుణేలో 60మంది పోలీసులకు కరోనా
కరోనా రాష్ట్ర వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోంది. పుణే నగరంలో 60 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. ఇప్పటి వరకు మహారాష్ట్రలో కరోనా బారిన పడిన పోలీసుల సంఖ్య 185కి చేరుకోగా.. వీరిలో 27 మంది పోలీసు ఉన్నతాధికారులే ఉన్నారు. 
మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆంక్షలు తీవ్రం చేస్తోంది. కరోనా మూడవ వేవ్ ప్రారంభమైన సంకేతాలు వస్తున్న నేపథ్యంలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 10వ తేదీ నుంచి రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తామని ప్రకటించింది. ఐదుగురు అంతకు మించి ఒకే చోట గుమిగూడకుండా నిషేధం విధించింది. అలాగే స్విమ్మింగ్ పూల్స్, జిమ్ములు, స్పా, బ్యూటీ సెలూన్లు, పార్కులు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. మాల్స్, సెలూన్లు 50 శాతం కెపాసిటీతో నడపాలని ఆదేశించింది. 

 

ఇవి కూడా చదవండి

సభలో ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించిన రైతు

 

కొంప ముంచిన పెంపుడు శునకం బర్త్ డే పార్టీ

ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న కాల్ సెంటర్