
- వ్యవస్థలను తమ గుప్పిట్లో ఉంచుకున్నది: సీపీఐ నారాయణ
హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగబద్ధ సంస్థలను బీజే పీ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తున్నదని సీపీఐ జాతీయ కార్య దర్శి కే నారాయణ అన్నారు. సీబీఐ, ఈడీ, న్యాయవ్యవస్థ, నీతి ఆయోగ్ వంటి స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలను స్వతంత్రంగా పని చేయనివ్వడం లేదని విమర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట, ప్రయోజనాలు కాపాడటంలో ప్రధాని మోదీ విఫలం అయ్యారని చెప్పారు.
మేడ్చల్ జిల్లా ‘కామ్రేడ్ పొట్లూరి నాగేశ్వర రావు నగర్’ (గాజుల రామారం), ‘కామ్రేడ్ ఎన్.బాలమల్లేశ్ హాల్’లో జరుగుతున్న సీపీఐ రాష్ట్ర మహాసభలో నారాయణ పాల్గొని మాట్లాడారు. ‘‘పార్లమెంటరీ వ్యవస్థను నాశనం చేసి.. దేశాన్ని పాలించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. 30 రోజులు జైల్లో ఉంటే.. చట్టసభల పదవులను రద్దు చేసేందుకు చట్టం చేస్తున్నరు. అలా అయితే.. రెండేండ్లు జైల్లో ఉన్న అమిత్ షా పదవిని ముందుగా రద్దు చేయాలి’’అని నారాయణ అన్నారు.
ఈడీ, ఐటీతో దాడులు చేస్తున్నరు
ఉప రాష్ట్రపతి స్థాయి వ్యక్తి చట్టసభ నుంచి రాత్రికి రాత్రి మాయం కావడం దేశచరిత్రలో మొదటిసారని నారాయణ పేర్కొన్నారు. ‘‘చట్టసభల్లో ప్రభుత్వానికి మద్దతు కోసం ఎంపీల లొసుగులను ఆసరాగా చేసు కుని ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నరు. ఉపరాష్ట్రపతి ఎన్నిక వ్యవహారంలో ప్రజాప్రతినిధులను బెదిరిస్తున్న రు’’ అని నారాయణ అన్నారు. దేశాన్ని మతం పేరుతో బీజేపీ విభజిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అవినీతి రెండింతలైందన్నారు.