అంబేద్కర్‌ ఆశయాలను కేంద్రం కాలరాస్తున్నది : జాన్ వెస్లీ

అంబేద్కర్‌ ఆశయాలను కేంద్రం కాలరాస్తున్నది : జాన్ వెస్లీ
  • రాజ్యాంగాన్ని బలహీనపరుస్తోంది: జాన్ వెస్లీ 

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని బలహీనపరిచి, మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా సీపీఎం ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామికశక్తులన్నీ ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు.