
జూబ్లీహిల్స్, వెలుగు: టైల్స్ వేయాలంటూ ఓ వ్యక్తికి ఫోన్ చేసిన సైబర్‌నేరగాడు అతని అకౌంట్నుంచి రూ.34 వేలు కాజేశాడు. తూముల రవికుమార్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ శ్రీకృష్ణనగర్ లో ఉంటున్నాడు. ఈ నెల 2న సాయంత్రం అతనికి ఓ ఫోన్కాల్వచ్చింది. అవతలి వ్యక్తి డాక్టర్ రాహుల్ గుప్తగా పరిచయం చేసుకున్నాడు. తనకు టైల్స్ అవసరమని, ఎంత ఖర్చవుతుందని అడిగాడు. రూ.37,200 అవుతాయని రవికుమార్చెప్పాడు. సైబర్ నేరగాడు అడ్వాన్స్‌గా రూ.7,200 పంపిస్తున్నానని చెప్పాడు. కాసేపటికి రవికుమార్ ఫోన్ కు రూ.72 వేలు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. పొరపాటున ఎక్కువ డబ్బులను పంపించానని చెప్పడంతో రవికుమార్ రూ.34,800 తిరిగి పంపించాడు. తర్వాత బ్యాంక్ స్టేట్‌మెంట్ చూసుకొని, ఎవరి నుంచి ఎలాంటి డబ్బులు రాలేదని గుర్తించాడు.