ట్రేడింగ్ మోసం చేశారు.. ఊచలు లెక్కపెడుతున్నారు.. 22 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్..

ట్రేడింగ్ మోసం  చేశారు.. ఊచలు లెక్కపెడుతున్నారు..  22 మంది  సైబర్ నేరగాళ్లు అరెస్ట్..

గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు  చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్​లో 14 కేసులు ఛేదించి, దేశవ్యాప్తంగా 22 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. ట్రేడింగ్ మోసాలకు సంబంధించి 10 కేసుల్లో 17 మంది, పార్ట్‌‌టైమ్ జాబ్ ఫ్రాడ్​లో ఇద్దరు, డిజిటల్ అరెస్ట్‌‌, ఇన్వెస్ట్​మెంట్ ఫ్రాడ్‌‌, జాబ్ ఫ్రాడ్​ కేసుల్లో ఒకరి చొప్పున అరెస్ట్ చేసినట్లు పోలీసులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి 15 సెల్‌‌ఫోన్లు, 17 సిమ్‌‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 48 కేసుల్లో కోర్టు ఆర్డర్​తో రూ.69.19 లక్షలు (266 రిఫండ్‌‌లు) బాధితులకు చెల్లించినట్లు వివరించారు. మరో కేసులో రూ.1.16 కోట్ల ఆన్​లైన్ ట్రేడింగ్ మోసానికి పాల్పడ్డ ఐదుగురిని మహారాష్ట్ర అరెస్ట్ చేశారు.