విద్యార్థులకు పోలీసుల ఓపెన్ హౌస్

విద్యార్థులకు పోలీసుల ఓపెన్ హౌస్

సైబరాబాద్ పరేడ్ గ్రౌండ్​లో పోలీసు అమరుల స్మారక వారోత్సవం సందర్భంగా శుక్రవారం విద్యార్థులకు పోలీసింగ్, ప్రజా భద్రతపై అవగాహన కల్పించేందుకు ఓపెన్ హౌస్ నిర్వహించారు. సైబరాబాద్ విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ డీసీపీ సృజన కర్ణం కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు చదువుతోపాటు సామాజిక సమస్యలు, శాంతిభద్రతల నిర్వహణలో పోలీసుల పాత్రను అర్థం చేసుకోవాలన్నారు.  

బాంబ్ డిస్పోజల్ టీమ్ బాంబ్ సూట్, బ్లాంకెట్, మెటల్ డిటెక్టర్లు సామగ్రిని ప్రదర్శించగా.. స్నిఫర్ డాగ్స్ పేలుడు పదార్థాలను ఎలా గుర్తిస్తాయో చూపించారు. అనంతరం బ్యాండ్ డ్రిల్, మౌంటెడ్ పోలీసుల గుర్రపు స్వారీ నిర్వహించారు. సన్​షైన్, ఇండియన్ పీపుల్, గౌతమ్ స్కూళ్ల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. - వెలుగు, హైదరాబాద్​ సిటీ