పశువుల మేతగా పత్తిచేను

పశువుల మేతగా పత్తిచేను

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామానికి చెందిన రైతు తక్కళ్లపల్లి బక్కరావుకు ఉన్న ఐదెకరాల పొలంలో రెండు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ఇటీవల వచ్చిన తుఫాన్​ కారణంగా పంట దెబ్బతిన్నది. దీంతో దిగుబడి వచ్చేలా లేకపోవడంతో ఉచితంగా గొర్రెలు, మేకలకు మేతకు వదిలేశాడు. కాగా, వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు సాగుచేస్తే అకాల వర్షం పంటలను నాశనం చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  మొగుళ్లపల్లి, వెలుగు