
- కన్వీనర్‌గా దాసు సురేశ్ ఎన్నిక
ఖైరతాబాద్, వెలుగు: విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం బీసీ ఐక్య కూటమి ఏర్పాటైంది. బీసీ రాజ్యాధికార సాధన సమితి అధ్యక్షుడు దాసు సురేశ్అధ్యక్షతన సోమవారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన రౌండ్ టేబుల్సమావేశంలో పలువురు వక్తలు, మేధావులు, విద్యార్థులు, న్యాయవాదులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగాదాసు సురేశ్మాట్లాడుతూ.. బీసీ సమాజం ఒకే వేదిక పైకి రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. రిజర్వేషన్లను సంపూర్ణంగా అమలు చేయడం కోసం న్యాయ కోవిదులు , రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. రిజర్వేషన్లు అమలయ్యే వరకు రాష్ట్రం, కేంద్రంలో పోరాటాలను తీవ్రతరం చేస్తామని పేర్కొన్నారు.
ఇక బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధి నుంచి కేంద్రం కోర్టులోకి వెళ్లిందని, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడానికి కేంద్రం చొరవ చూపాలని కోరారు. రాజ్యసభసభ్యుడు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. అందరూ ఏకం కావాల్సిన సమయం అనివార్యమైందని ఆయన అన్నారు. పార్లమెంటులో బీసీ బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించేంత వరకు తాను పోరాటం చేస్తానని కృష్ణయ్య వివరించారు. ఈ సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యుడు వి. హన్మంతరావు, రాపోలు ఆనంద్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, మధుసూదనాచారి, మాజీ ఐఏఎస్
చిరంజీవులు, తెలంగాణ విఠల్తదితరులు పాల్గొన్నారు.