డబ్బులు వెనక్కి.. డెట్ఫండ్స్కు తగ్గిన ఆదరణ.. సెప్టెంబర్లో రూ. 1.02 లక్షల కోట్ల ఔట్ఫ్లో

డబ్బులు వెనక్కి.. డెట్ఫండ్స్కు తగ్గిన ఆదరణ.. సెప్టెంబర్లో రూ. 1.02 లక్షల కోట్ల ఔట్ఫ్లో

న్యూఢిల్లీ: ఫిక్స్​డ్​ఇన్​కమ్​ మ్యూచువల్ ఫండ్స్ నుంచి సెప్టెంబరులో భారీగా నిధులు బయటకు వెళ్లాయి. లిక్విడ్, మనీ మార్కెట్ ఫండ్స్ నుంచి కంపెనీల ఉపసంహరణల కారణంగా నికరంగా రూ. 1.02 లక్షల కోట్ల నిధులు బయటకు వెళ్లాయి. అంతకుముందు నెలలో (ఆగస్టు) రూ. 7,980 కోట్ల ఔట్​ఫ్లో ఉందని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) డేటా తెలిపింది. 

సెప్టెంబరులో డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి రూ. 1.02 లక్షల కోట్ల ఉపసంహరణ ఉంది. జులైలో డెట్ ఎంఎఫ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. 1.07 లక్షల కోట్ల నిధులు వచ్చాయి. మార్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టార్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మేశ్రామ్​ మాట్లాడుతూ,  లిక్విడ్, మనీ మార్కెట్ ఫండ్స్ నుంచి భారీ సంస్థాగత ఉపసంహరణల వల్ల గత నెల డెట్​ఫండ్స్​నుంచి ఔట్​ఫ్లో ఎక్కువ ఉందని అన్నారు.  

అయితే ఫిక్స్​డ్​ఇన్​కమ్​ఫండ్ల ఆస్తుల నిర్వహణ విలువ (ఏయూఎం)ను ఆగస్టు చివరిలో ఉన్న రూ. 18.71 లక్షల కోట్ల నుంచి సెప్టెంబరు చివరి నాటికి 5 శాతం తగ్గి రూ. 17.8 లక్షల కోట్లకు చేరింది. డెట్ కేటగిరీల్లో, లిక్విడ్ ఫండ్ కేటగిరీ నుంచి అత్యధికంగా రూ. 66,042 కోట్ల ఉపసంహరణ జరిగింది.  

మనీ మార్కెట్ ఫండ్స్ నుంచి రూ. 17,900 కోట్లు, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ నుంచి రూ. 13,606 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్ ఫండ్స్ మాత్రం రూ. 4,279 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఈక్విటీ ఎమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలోకి 
సెప్టెంబరులో రూ. 30,421 కోట్లు వచ్చాయి. ఇది ఆగస్టులో ఉన్న రూ. 33,430 కోట్ల కంటే 9 శాతం తక్కువ.