కలుసుకోవాలంటే కూడా కాల్షీట్లు కేటాయించుకోవాల్సిందే : దీపికా పదుకునే

కలుసుకోవాలంటే కూడా కాల్షీట్లు కేటాయించుకోవాల్సిందే : దీపికా పదుకునే

బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలకు కేరాఫ్గా ఉన్న స్టార్ కపుల్ రణ్ వీర్ సింగ్(Ranveer Singh), దీపికా పదుకునే(Deepika Padukone)..ది బెస్ట్ కపుల్గా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. షూటింగ్లతో పాటు, సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే దీపికా పదుకునే..తమ 5వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. 

ఈ బిజీ లైఫ్ లో కనీసం..తామిద్దరం కలుసుకోవడానికి అస్సలు టైమ్ దొరకడం లేదని..ఇక తామిద్దరం మాట్లాడుకోవాల్సి వస్తే..షెడ్యూల్స్ కేటాయించుకుంటున్నామని తెలిపింది. గత 2 ఏళ్ల నుంచి చాలా పెద్ద ప్రాజెక్ట్స్ లో భాగమవుతుండటం వల్ల..కాల్షీట్లు కేటాయించనప్పుడే మాత్రమే ఇరువురు కలుసుకుంటామని తెలిపింది.  

అలాగే..ఎవరికైనా ఫారిన్ షూటింగ్స్కు వెళ్లాల్సి వస్తే..ఆ బాధ వర్ణనాతీతం అంటోంది దీపిక. అలా కొన్నిసార్లు రోజుల తరబడి కూడా.. కలుసుకోవడం ఆసలు కుదరదని..ఇక అలాంటప్పుడు బాధ అనిపిస్తుందని తెలిపింది. 

సక్సెస్ ఫుల్గా ఐదేళ్ల వివాహ బంధాన్ని..సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీ అంటూ..తమ పెళ్లికి సంబంధించిన కొన్ని స్టిల్స్తో పాటు, రామ్ లీల మూవీ షూటింగ్ టైమ్లో దిగిన కొన్ని ఆన్-లొకేషన్ స్టిల్స్ ను..యూరప్ ట్రిప్ ఫొటోస్ను..ఇన్స్టాలో షేర్ చేసింది.