ఢిల్లీ హైకోర్టులో టీఎంసీ నేత మహువా మోయిత్రాకు చుక్కెదురు

ఢిల్లీ హైకోర్టులో టీఎంసీ నేత మహువా మోయిత్రాకు చుక్కెదురు

న్యూఢిల్లీ: పార్లమెంట్ లో ప్రశ్నలు అడగడానికి వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణల కేసులో టీఎంసీ నేత మహువా మోయిత్రా పిటిషన్ ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. బీజేపీ నేత నిషికాంత్ దుబే, అడ్వైజర్ జై అనంత్ దేహద్రాయ్ లు ఈ కేసుకు సంబంధించిన కంటెంట్ తయారుచేసి పోస్ట్ చేస్తు్న్నారనని దీనిని వెంటనే ఆపాలని మహువా మోయిత్రా ఢిల్లీ హైకోర్టు పిటిషన్ వేసింది. సోమవారం (మార్చి 4) విచారించిన ఢిల్లీ హైకోర్టు.. టీఎంసీ నేత మహువా మోయిత్రా  దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. 

ఇటీవల ఫెమా కేసు కింద కొనసాగుతున్న దర్యాప్తుకు సంబంధించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) నుంచి మీడియా లీకేజీకి సంబంధించి ఢిల్లీ హైకోర్టు మహువా మోయిత్రా వేసిన పిటిషన్ వేసింది. మహువా మోయిత్రా లికింగ్ ఇన్ఫర్మేషన్ పిటిషన్ ను కూడా ఫిబ్రవరి 25 2024 న కొట్టివేసింది ఢిల్లీ హైకోర్టు.